కార్మిక వర్గ పోరాటాలను ఉదృతం చేయడం ద్వారానే తిరందాసు గోపి గారికి నిజమైన నివాళి.
Yadadri Bhuvanagiri— జిల్లా సెమినార్ లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పోరాటాలను ఉదృతం చేయడం ద్వారానే తిరందాసు గోపి గారికి నిజమైన శ్రద్ధాంజలి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు అన్నారు.
గురువారం రోజున సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ తిరందాసు గోపి గారి 8 వ వర్ధంతి సందర్భంగా స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన “ ప్రభుత్వ విధానాలు – కార్మిక వర్గంపై ప్రభావం “ అనే అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది.
ఈ సెమినార్ కి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు మాట్లాడుతూ కార్మికోద్యమ నాయకుడిగా అనేక పోరాటాలు నిర్వహించిన గోపిగారు నిరంతరం ప్రభుత్వ విధాలను ప్రశ్నించేవాడని గుర్తుచేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ లో కార్మిక శాఖకు కేటాయించింది కేవలం 900 కోట్లు మాత్రమే నని రాష్ట్రంలో ఉన్న కోటి యాభై లక్షల కార్మికులకు ఏవిధంగా ఉపయోగపడదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని ఈ లేబర్ కోడ్ లు ఏప్రిల్ 01 నుండి అమలులోకి వస్తున్నాయని దీని వల్ల కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ వ్యాపితంగా కార్మిక వర్గం పోరాడి 08 గంటల పని విధానం సాధించుకుంటే మోడీ తెచ్చే లేబర్ కోడ్ ల వల్ల పరిశ్రమల యాజమాన్యాలు 12 గంటలకు పైగా కార్మికులతో శ్రమదోపిడి చేసుకునే వెసులుబాటు యాజమాన్యాలకు కల్పించిందని విమర్శించారు.లేబర్ కోడ్ ల ద్వారా పర్మినెంట్ ఉద్యోగులు అనే పద్ధతికి స్వస్తి పలికి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ విధానం తీసుకువచ్చిందని ,పరిశ్రమలో యూనియన్ ఏర్పాటు అనేది రానున్న రోజులలో ప్రశ్నార్ధకంగా మారనుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేకిగా కార్పొరేట్ అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 50 లక్షల , 65 వేల 345 కోట్ల బడ్జెట్ లో కార్మికుల సంక్షేమం గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.
సెమినార్ లో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ గారు మాట్లాడుతూ నిత్యం దేశ భక్తి గురించి మాట్లాడే మోడీ అధికారంలోకి రాక ముందు దేశం అప్పు 55 లక్షల కోట్లు అయితే మోదీ అనంతరం మన దేశం అప్పు 181 లక్షల కోట్లకు చేరుకుందని దేశాన్ని అప్పుల పాలుచేశాడని దేశ బడ్జెట్ లో 25% బడ్జెట్ కేవలం వడ్డీలుచెల్లించడానికి సరిపోతుందని తెలియజేశారు.
తీరందాసు గోపి గారు కార్మిక హక్కుల కోసం పనిచేశాడని తను మన మద్యలేకపోయిన తను నమ్మిన పోరాట మార్గంలో కార్మికులు నడవాలని అందుకోసం కార్మిక వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సెమినార్ లో సీనియర్ కామ్రేడ్ సంగు నరేందర్ గారు ,సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం , జిల్లా ఉపాధ్యక్షులు యండి పాషా , గొరిగే సోములు , జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం ఈశ్వర్ , సిఐటియు జిల్లా కమిటి సభ్యులు పైళ్ల గణపతిరెడ్డి ,పొట్ట యాదమ్మ , బందెల భిక్షం ,బత్తుల దాసు , కసగోని లలిత , మొరిగాడి రమేష్ , గాడి శ్రీను,మంచాల మధు , పుప్పాల గణేష్ , పోతరాజ్ జహంగీర్ , నాయకులు సంతోష , పుష్ప , శ్రీధర్ , మీసాల రవి , అలివేలు తదితరులు పాల్గొన్నారు.