
ఈ69న్యూస్ జనగామ
పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జనగామ జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ ను వెంటనే సీజ్ చేయాలని సూపర్ మార్కెట్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు రోడ్డులో గల మోర్ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిపోయిన తిను బండారాలను అమ్ముతూ పసిపిల్లల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారనిమోర్ సూపర్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకొని వెంటనే సీజ్ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ డిమాండ్ చేశారు.కాగా ఈ విషయం జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేయగా వెంటనే వారు స్పందించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశంకు ఆదేశాలు జారీ చేసి తక్షణం మోర్ సూపర్ మార్కెట్ ను సందర్శించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కమీషనర్ వెంటనే వారి సిబ్బంది పులి శేఖర్ భాస్కర్ అక్కడికి చేరుకొని జనగామ పోలీస్ ఎస్ఐ రాజేష్ కానిస్టేబుల్ రామకృష్ణ సమక్షంలో కాలం చెల్లిన వస్తువులను పరిశీలించి మోర్ సూపర్ మార్కెట్‌ను మూసివేసి మున్సిపల్ సిబ్బందికి తాళాలు అప్పగించారు.