కిలోమీటర్ మేర పడిపోయిన చెట్లను జేసిబిలతో తీయించిన-కాంగ్రెస్ నేత బొల్లేపల్లి
Jangaonకుండపోతగా కురిసిన భారీ వర్షం దాటికి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు తెగిపోయి చెట్లు విరిగిపడ్డాయి.దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది.ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ దృష్టికి ప్రజలు తీసుకెళ్లినా పట్టించుకోలేదు,కనీసం ఇంటి నుండి బయటకు కూడా రాలేదు.ఈ పరిస్థితిపై స్పందించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వైద్య విభాగం) డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ సొంత డబ్బులు వెచ్చించి జెసిబితో రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు.జాఫర్ గడ్ మండలం గీతాంజలి స్కూల్ రామాలయం ఎస్సీ కాలనీ నుంచి ఘన్పూర్ హనుమకొండ వెళ్లే దారిలో ఒకటిన్నర కిలోమీటర్ మేర పడిపోయిన చెట్లను తీసి వేయించి రాకపోకలు సజావుగా సాగేలా ఏర్పాటు చేశారు.తమకోసం స్పందించి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నేత డాక్టర్ కృష్ణ కి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ జెసిబిని తెప్పించిన విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వెంటనే తాను కూడా జెసిబిని తెప్పించారు.అయితే వర్షం ముగిసి మూడు రోజులైనా స్పందించని సర్పంచ్ ఇప్పుడు హడావిడిగా జెసిబిని తెప్పించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు.వర్షం దాటికి తెగిపోయిన రోడ్లు, దెబ్బతిన్న కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని డాక్టర్ కృష్ణ డిమాండ్ చేశారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి బోళ్ళ మత్తడి కల్వర్టు నీటిలో మునిగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని,దీంతో ఖమ్మం నుండి వయా వర్ధన్నపేట,జాఫర్గడ్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు బైపాస్ దారుల ద్వారా వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్వర్టు ఎత్తు పెంచుతామని గతంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కడియం ఆ మాటే మర్చిపోయారని మండిపడ్డారు.వెంటనే కల్వర్టు ఎత్తు పెంచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.వర్ష బీభత్సానికి జనజీవనం స్పందించి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండా ఉండటం సరికాదన్నారు. ఎంతసేపు ఒకరినొకరు తిట్టుకోవడం,బిడ్డకు టికెట్ కావాలనడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పించారు.ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వరద సమస్యలపై దృష్టి సారించాలన్నారు.వర్షం ముగిసి రెండు రోజులైనా రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.సూరారం హిమ్మత్ నగర్ రోడ్డు తెగిపోయి మూడేళ్ళు అయినా పట్టించుకోలేదన్నారు.ఈ సమస్యపై తాను గత నెలలోనే స్పందించి మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఇకముందు కూడా ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాఫర్గడ్ మండల మాజీ జెడ్పిటిసి పట్టపురి సదయ్య గౌడ్, జాఫర్గడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి హబీబ్ ఖాన్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాంచార్ల యాదగిరి,సీనియర్ నాయకులు డాక్టర్ సోమనారాయణ,డాక్టర్ రత్నాకర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు పట్టపురి విజయ్,ఎల్ల గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.