
కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓరుగల్లు చారిత్రాత్మక దేవాలయం శ్రీ రుద్రేశ్వర స్వామి(వెయ్యి స్తంభాల దేవాలయం)లో స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి తమ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు,అర్చకులు,వేదపండితులు స్వాగతం పలికారు.అనంతరం స్వామి వారికి పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా దర్శించుకున్నారు.