ఎమ్మెల్యే బండారు శ్రావణి
- ఎమ్మెల్యే బండారు శ్రావణి
ఈ69 న్యూస్, శింగనమల.
మండలం,తక్కలపల్లి గ్రామంలో నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గోని కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు , ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం డబ్బులు పడ్డాయ అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
గోకులం షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం అనంతరం ఎస్సి కాలనీ లో రైతు రూ.2.30 లక్షల తో నిర్మించిన గోకులం షేడ్ ను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలకు బి.టి. రోడ్ లు , సిసి రోడ్లు,డ్రైనేజీలు, గోకులం షెడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామన్నారు. తక్కలపల్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిసి రోడ్డును, 9 లక్షల రూపాయల తో 5 గోకులం షెడ్లను, 60 వేల రూపాయలతో 2 పశువుల తోటలను, 11 లక్షల రూపాయలతో 14 ఫారం పాండ్లను నిర్మించామని తెలిపారు.రైతులకు పంట చేనులలో అంతర్గత పంటలు పండించేందుకు పెసర విత్తన సంచులును ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పంపిణీ చేసారు.