కూనూరు లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి ఈ69న్యూస్ జఫర్ఘడ్:-సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం కూనూరు గ్రామంలో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నేటి తరానికి ఆదర్శనీయుడని కొనియాడారు.బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు పాపన్న అని కొనియాడారు.సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా గీత కార్మికుడిగా కొనసాగిన ప్రస్థానంలో అణచివేత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహా యోధుడు పాపన్న అని పేర్కొన్నారు.కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.