గళం న్యూస్ అడ్డగూడూరు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డి రాపాక గ్రామంలో కృషి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృషి యూత్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు భూపతి నర్సయ్య మాట్లాడుతూ సమసమాజ స్థాపనలో అలుపెరగని పోరాటం చేసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కృషి యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ముక్కాముల మనోజ్ కుమార్, గ్రామ పెద్దలు లింగాల నర్సిరెడ్డి, రామ్ రెడ్డి, ముక్కాముల కొండయ్య, నర్సయ్య యాదగిరి, కడియం దశరథ, మూడ వీరేశం, యాదగిరి, సురేష్, యాదగిరి, నరేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు