
కేంద్ర బిజెపి ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలకు పై ఉద్యమాలు ఉదృతం చేయాలని కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలనీ,దేశ పాలన నుండి మోడీ గద్దె దిగాలని క్విట్ మోడీ అంటూ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నందు నిరసన ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో రవీందర్ గారికి నాయకులు అందజేశారు
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ
దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టడం కోసం ఇచ్చిన పిలుపు క్విట్ ఇండియా పోరాటస్ఫూర్తితో కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై ఉపసంహరించుకునే అంతవరకు పోరాడాలన్నారు బీజేపీ మోడీ ప్రభుత్వం దేశ సంపదలను కార్పొరేట్ ధనవంతులకు అమ్ముతూ దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తూ కార్పొరేట్ ల సేవలో మునిగిపోయారనీ దేశాన్ని పాలించే అధికారం మోడీ ప్రభుత్వానికి లేదని పాలన నుండి తొలగిపోవాలని క్విట్ మోడీ,క్విట్ బిజెపి అని విమర్శించారు.క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశ వ్యాపితంగా కార్మికులు,ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలలో పాల్గొంటున్నారని తెలియజేశారు.స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.కార్మికుల ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచుతూ చట్టాలను తీసుకువచ్చిందనీ లని విమర్శించారు. కార్మిక వ్యతిరేకమైన విధానాలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వ స్కీములైన ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఐకెపి వివో ఏలు తగిన బడ్జెట్ను పెంచి గ్రామపంచాయతీ వార్కాల్లో ఇతర కార్మికులందరికీ కనీస వేతనం నెల 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణను వెంటనే నిలుపుదల చేసి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. దేశంలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడే వారి పై కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు ప్రయోగిస్తూ నియంతృత్వంగా పరిపాలిస్తున్నదని విమర్శించారు. వీటికి తోడు విద్యుత్, రైల్వే ప్రైవేటీకరణ వల్ల దేశంలోని రైతులకు సామాన్య ప్రజలకు పెనుబారంగా మారుతుందని విమర్శించారు.కార్పొరేట్ ధనవంతుల లాభాల కొరకే బిజెపి కేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు.విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసి ప్రైవేటు విధానాన్ని పూర్తిగా రూపుమాపాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి కార్మికులు ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేసి అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టం చేసి పిఎఫ్ ,ఈఎస్ఐ ,ప్రమాద బీమా సౌకర్యాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల భవిష్యత్తులో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ,రైతులు, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ సూపర్డెంట్ రవీందర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజేందర్ రైతు సంఘం నాయకులు రామవత్ మీట్యా నాయక్ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ గారికి సంఘం జిల్లా మండల నాయకులు గోసంగి శంకరయ్య మంగ బీరయ్య అన్నేబోయిన రాజు మల్లేష్ రాజ్ బోట్ల వెంకటేష్ నరేష్ సుధాకర్ దేవదానం యాకన్న సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.