
telugu galam news e69news local news daily news today news
పిబ్రవరి 16న మధ్యాహ్నా భోజన పథకం కార్మికుల సమ్మె
- తెలంగాణ మధ్యాహ్నా భోజన పథకం కార్మికులు యూనియన్ నిర్ణయం.
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయాలని, 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరగబోయో కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్‌లో తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాహ్నా భోజన పథకం కార్మికులు కూడా సమ్మె చేయాలని ఈరోజు హైదరబాబాద్లో జరిగిన తెలంగాణ మధ్యాహ్నా భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాహా భోజన పథకం కార్మికులంతా సమ్మె-గ్రామీణ బండ్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల ప్రజల కోసం 40 సంవత్సరావల నుండి కొనసాగుతున్న స్కీమ్‌లను బలోపేతం చేయాల్సి కేంద్ర ప్రభుత్వం చేయడంలేదని, దేశంలో సుమారు కోటి మంది పనిచేస్తున్న కేంద్ర స్కీములకు ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టిందని, ఐఎస్ఓ తీర్మానం ప్రకారం స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం, కనీస వేతనాలు చెల్లించడం, పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని నిశితంగా విమర్శిస్తూ, భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకికవాదాన్ని తారుమారు చేస్తూ హిందూ రాజ్యస్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్తుందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి మొదలైన కీలక అంశాలను ప్రజల దృష్టి నుండి మరల్చడానికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని మతతత్త్వ శక్తులు ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవం, అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చాయన్నారు. రాజ్యాంగానికి, లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ మొత్తం ప్రభుత్వ కార్యక్రమంగా, మోడీ భజనగా మార్చివేశారని, ఈ తరుణంలో కార్మికవర్గంలో సయా ఉదారవాద విధానాల వినాశకర ప్రభావం గురించి, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ యొక్క మత విభజన కుతంత్రాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం నూతన రాష్ట్ర అధ్యక్షురాలుగా కామ్రేడ్ వై. స్వప్నను విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ బేరర్స్ బాలలక్ష్మి, మాయ, కృష్ణమాచారీ, రాధబాయి, యాకలక్ష్మి, యూనియన్ రాష్ట్ర నాయకులు విజెందర్, చిన్నన్న, గీత, రజిత, భాగ్య, సిద్ధమ్మ, శారధ తదితరులు పాల్గొన్నారు.