
citu news local news e69news telugu galam news hanamakonda news warangal news
ఫిబ్రవరి 16న అఖిల భారత సమ్మె
గ్రామీణ భారత్ బంద్
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ పిలుపు
హనుమకొండ రాంనగర్ సుందరయ్య భవన్ లో శనివారం రోజున సీఐటీయు, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల జిల్లా సదస్సు సారంపల్లి వాసుదేవరెడ్డి టీ ఉప్పలయ్య ఎం శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది.ఈ జిల్లా సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ మాట్లాడుతూ..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వo కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. రైతులకి మద్దతు ధర ప్రకటించడంలో వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ఉపాధి హామీ నిధులను పెంచడంలో ప్రభుత్వము విఫలమయిందని విమర్శించారు. కార్పొరేట్ మతోన్మాద నయా ఉదారవాద విధానాల వలన ప్రజలు కార్మిక వర్గం రైతాంగం పేద ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతను గుర్తించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ మత రాజకీయాలకు తెరలేపుతూ అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ , విద్యుత్ సంస్కరణ బిల్లు, కార్మిక చట్టాల మార్పు, నేషనల్ మానిటైజేషన్ , జీఎస్టీ , ఇలా అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి ప్రజల ఆస్తులను దోచి పెట్టుబడుదారులు, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ వారికి లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయి.కాబట్టి ఈ బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పి కొట్టడంలో భాగంగా దేశంలోని కార్మిక వర్గం , రైతాంగం , ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా ఫిబ్రవరి 16 న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ , పారిశ్రామిక బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కాబట్టి జిల్లాల్లో ఉన్న స్కీమ్ వర్కర్లు, ప్రజలు, రైతులు,కార్మికులు, కర్షకులు,విద్యార్థులు, మేధావులు అందరూ గ్రామీణ బందులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాములు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య సిఐటియు నాయకులు గాదె ప్రభాకర్ రెడ్డి మెట్టు రవి బొట్ల చక్రపాణి గొడుగు వెంకట్ కే లింగయ్య వేల్పుల సారంగపాణి పుల్ల అశోక్ చిలుక రాఘవులు పద్మ కళావతి తదితరులు పాల్గొన్నారు.