కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎంపి డా.కడియం కావ్యఈ69న్యూస్:- న్యూ దిల్లీ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇటీవల వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్కు ఆమోదం తెలిపినందుకు,కృతజ్ఞతలు తెలియజేశారు.వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ మరియు ఎయిర్క్రాఫ్ట్ కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఎంపీ కోరారు.మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వెల్లడించారు.ఎయిర్ పోర్టు భూసేకరణకు తెలంగాణ సర్కార్ 205 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు.మామునూరు ఎయిర్పోర్ట్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను మరియు పెద్ద విమానాల కార్యాచరణను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ అభ్యర్థించారు.ఈ సందర్భంగా,రామ్మోహన్ నాయుడు వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు,రోడ్డు కనెక్టివిటీ,మౌలిక వసతుల కల్పన,భూ సేకరణ అనంతరం విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.