
కేంద్ర విధానాలను ఎండగట్టాలి–రాష్ట్ర హామీలు నెరవేర్చాలి: సీపీఐ

ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి ఐ గ్రామంలో సీపీఐ గ్రామ మహాసభ నిర్వహించారు.ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా నాయకుడు జువారి రమేష్ మాట్లాడుతూ,కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో విఫలమవుతోందని విమర్శించారు.గ్యాస్ ధరలు పెరగడం,ఉపాధి పనుల విఫల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని,వరి కొనుగోలు వెంటనే చేయాలని,బోనస్ చెల్లింపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో నూతనంగా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.