
టిడిపి తీర్థం పుచ్చుకున్న 50 వైసిపి కుటుంబాలు
-ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్న 50 వైసిపి కుటుంబాలు
గళం న్యూస్, గార్లదిన్నె, రిపోర్టర్ :తులసిరామ్
గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామపంచాయతీ కేకే తాండ లో వైసీపీకి భారీ షాక్ తగిలింది . వైసీపీకి చెందిన ప్రసాద్ నాయక్, మిద్ది ఆంజనేయులు నాయక్, లక్ష్మణ్ నాయక్, రాంబాబు నాయక్,రాంజీ నాయక్,వెంకట నాయక్, రాందాస్ నాయక్ తోపాటు 50 కుటుంబాలు శుక్రవారం రాత్రి టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ముంటిమడుగు కేశవరెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముంటిమడుగు కేశవరెడ్డి మాట్లాడుతూ పార్టీ అన్ని విధాలుగా తోడు ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మిల్ట్రీ సీనప్ప, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.