
కేయూ వీసీ, రిజిస్ట్రారు బర్తరఫ్ చేయకుంటేఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ని ప్రభుత్వం భర్తరఫ్ చేయకుంటే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉదృతం చేస్తామని కేయూ విద్యార్ధి జేఏసీ నేతలు హెచ్చరించారు. కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన వరంగల్ జిల్లా బంద్కు వివిధ రా జకీయ పార్టీలు, విద్య, వాణిజ్య, వ్యాపార వర్గాలు మద్దతు పలికాయి. కేయూ జంక్షన్ వద్ద విద్యార్థి నేతలు ఆందోళన చేపట్టారు. ఈసందర్భం గా. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కేయూ వీసీ తాటికొండ రమేష్ 2021 మే నెలలో ఛార్జ్ తీసుకున్న ప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా బాది తులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు అంటే ఎంతటి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడో అర్థం అవుతుందన్నారు. ఇటువంటి నిరంకుశ పాలన నుండి ముక్తి సాధించాలంటే ఉద్యమం తీవ్రతరం చే యాల్సిందేనని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. కేటగిరీ-1 పి. ఎచ్.డీ లో అవకతవకలకు – పాల్పడ్డారని ఇంగ్లీష్ విభాగానికి చెందిన వరలక్ష్మి కేసు వేయగా హైకోర్టు అడ్మిషన్ల ప్రక్రియను ఆపివేయాలని మధ్యం తర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయినా కూడా ఉత్తర్వులను లెక్క చేయకుండా అడ్మిషన్లు జరపడం లో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టు ధిక్కరణ కు అప్పటి రిజిస్ట్రార్ వెంకట రామిరెడ్డి పాల్పడ్డారని వారిని శిక్షించాలని వరలక్ష్మి వేసిన కేసుకు యూనివ ర్సిటీ రిజిస్ట్రార్ ను హైకోర్టుకు హాజరుకావాలని పిలి చిందంటే యూనివర్సిటీ ప్రతిష్టను అధికారులు ఎంత మంట గలిపారో అర్థం అవుతుందన్నారు. ఇలా అడ్మిష న్లపై -మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆ కేసు పూ ర్తి డిస్పోజల్ కాకుండానే మళ్ళీ కేటగిరీ -2 పి. ఎచ్.డీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడం కూడా కోర్టు ధిక్కరనే అవు తుందని అన్నారు. హైకోర్టు ధిక్కరణకు పాల్పడినం దుకుగాను కేయూసీ పోలీసు స్టేషన్ లో వీసీ, రిజిస్ట్రార్ మీద (ఎఫ్.ఐ.ఆర్.నెంబరు 59, 2023 ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ అయిందన్నారు. 418, 425,405, 406, 409, 156(3) సెక్షన్ల కింద జనవరి 2023లో కేసు నమోదైందని, వీసీ పై ఎఫ్.ఐ.ఆర్ అయిన ఘనత యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి అన్నారువీసీ, రిజిస్ట్రార్ అక్రమంగా సీని యర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందారని, వారి ఇంటర్వ్యూ లను వారే పెట్టించుకొని, వారి నోటిఫికేషన్ వారే విడు దల చేసుకొని, వారి సెలెక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్ ను వారే పాలకమండలి ఇంటింటికి తిరిగి సంతకాలు చే యించి యూజీసీ నిబంధనలకు పాతర వేసి ప్రమోషన్ పొందారని విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్ ఆకృత్యాలను ప్రశ్నిస్తున్న టీచర్స్ అసోసి యేషన్ అధ్యక్షులు, కార్యదర్శిల ప్రమోషన్లకు అడ్డు పడ్డందుకు వేసిన కేసుకు ఎందుకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తాలేరో చెప్పాలన్నారు. కేసు పరిష్కారం రాకుండా కౌంటర్ దాఖలు చేయకుండా సమయాన్ని కేవలం ఫాం హౌజ్ కే పరిమితం చేస్తున్న అధికారులు సిగ్గు పదాలని అన్నారు. అనంతరం. విద్యార్థి జేఏసీ నేతలు ట్రైసిటీ లో బైక్ ర్యాలీ చేపట్టారు. కొన్ని చోట్ల కేయూ సీఐ విద్యార్ధి జేఏసీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఏసీపీ కిరణ్ కుమార్ చొరవతో వి ద్యార్థు లను సముదాయించి పంపించారు. బంద్ అనంతరం కె.యూ కూడలిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహ నం చేశారు. కార్యక్రమంలో కె. యూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్, విజయ్ కన్నా, మేడ రంజిత్ కుమార్, వలి జిల్లా ఖాద్రి, నిమ్మల రాజేష్, అమర్, విజయ్, పల్లకొండ సతీష్, రాజు నాయక్, బి నరసింహ రావు, మొగిలి వెంకట్, పాషా, రాకేష్, కృషన్, బొచ్చు తిరుపతి, బొట్ల మనోహర్, వడ్డేపల్లి మధు, కాశీనాధ్, రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు తీగల భరత్, బీఎస్పీ కన్నం సునీల్, మంద శ్యామ్ ఒంటేరు చక్రి పాల్గొన్నారు.