•ముగ్గురు నిందితుల అరెస్ట్
•2.3 కిలోల గంజాయి, 53 గంజాయి చాక్లెట్లు స్వాధీనం


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా,విక్రయాలపై పోలీసులు దాడి నిర్వహించి ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను కొత్తపల్లి గోరి ఎస్సై సాకపురం దివ్యా అరెస్టు చేశారు.ఈ దాడి వివరాలను గణపురం సర్కిల్ సీఐ కరుణాకర్ రావు కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.సీఐ కరుణాకర్ రావు కొత్తపల్లి కె గ్రామ శివారులోని కెనాల్ వద్ద గంజాయి విక్రయం జరుగుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై దివ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.పంచులు, రెండు ప్రభుత్వ వాహనాలు, డిజిటల్ వెయర్, ఫోటోగ్రాఫర్ సహకారంతో శ్రీమాత రైస్ మిల్–గాంధీనగర్ రోడ్డు మీద సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్టు వివరించారు.పోలీసులను చూసి పరారయ్యే ప్రయత్నం చేసిన ముగ్గురు అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకొని,వారి వద్ద జరిగిన తనిఖీలో 2.3 కిలోల ఎండు గంజాయి,53 గంజాయి చాక్లెట్లు,3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.అరెస్టయిన నిందితులు 1.చోట కుమార్ వయసు 20 సంవత్సరాలు, హమాలీ, కర్ణభూష గ్రామం, కగారియ జిల్లా, బీహార్
2.కుందన్ కుమార్ వయసు 20 సంవత్సరాలు, హమాలీ, కర్ణభూష గ్రామం, కగారియ జిల్లా, బీహార్
3.సంతోష్ కుమార్, వయసు 18 సంవత్సరాలు, హమాలీ, కర్ణభూష గ్రామం, కగారియ జిల్లా, బీహార్
ముగ్గురూ గోరి కొత్తపల్లి ప్రాంతంలోని శ్రీమాత రైస్ మిల్ వద్ద హమాలీలుగా పనిచేస్తూ గంజాయి విక్రయ చక్రాన్ని నడిపుతున్నట్టు విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.
బీహార్ నుంచి గంజాయి తెప్పించి భారీ లాభాలు
విచారణలో నిందితులు బీహార్ రాష్ట్రం నుండి కిలోకురూ.2,000 ధరకు గంజాయి తెప్పించి, భూపాలపల్లి పరిసరాల్లో కిలోకు రూ.50,000 ధరకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్టు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.పంచుల సమక్షంలో సీజ్ పంచనామా, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించి అన్ని సాక్ష్యాలను మాల్టానాకు అప్పగించినట్టు సమాచారం.తదనంతరం ముగ్గురు నిందితులపై ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలపై పోలీసుల హెచ్చరిక
ఈ సందర్భంగా సీఐ సిహెచ్ కరుణాకర్ రావు మాట్లాడుతూ మా సర్కిల్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము.యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది.గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులు చేపడుతున్న నేర నిరోధక చర్యలకు సహకరించాలి అని చెప్పారు.అలాగే,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు యువతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు తెలిసినా వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిఐ కరుణాకర్ రావు తో పాటు ఎస్సై దివ్య,రెండవ ఎస్సై షా ఖాన్, హెడ్ కానిస్టేబుల్ కే రమణయ్య, కానిస్టేబుల్స్ హరీష్,లింగన్న,కిరణ్ సింగ్,ఉపేందర్, కుమారస్వామి పాల్గొన్నారు.