
క్రీడలతో కూడిన పరిపూర్ణ విద్య కు కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ పాఠశాలలు
ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు . గురువారం క్రీడా స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా నడిగూడెం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో కోదాడ నియోజకవర్గస్థాయి గేమ్స్ నిర్వహించారు. గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. లాంగ్ మార్చ్ తో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….,జీవితాన్ని చదవడంలో క్రీడలదే ప్రముఖ పాత్ర అన్నారు. క్రీడా స్ఫూర్తిని తీసుకొని విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు.ప్రస్తుత ఆధునిక యుగం ఒత్తిడికి గురవుతున్న పిల్లలను బయట పడేయటంలో క్రీడలదే ప్రధాన పాత్ర అన్నారు. క్రీడలలో గెలుపు, ఓటముల ద్వారా వచ్చే అనుభవాలు జీవితంలో వచ్చే ఆటు, పోటులను తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడాకారులకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలో అయినా నా భాగస్వామ్యం ఉంటుందని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. క్రీడలతో కూడిన పరిపూర్ణ విద్యకు కేరాఫ్ గా ను ప్రభుత్వ పాఠశాలలను తీర్చిద్ధిద్ది కోదాడ నియోజకవర్గమును
క్రీడా హబ్ గా తీర్చి దిద్దాలని పిలుపు నిచ్చారు. నిత్య జీవితంలో ఒత్తిడిని జయించాలన్నా, జీవితంలో ఎత్తుపల్లాలను ఎదుర్కోవాలన్నా క్రీడలు గొప్ప సాధనాలని అన్నారు . మానసిక ఉల్లాసం దేహ దారుఢ్యం తో పాటు క్రీడా స్ఫూర్తిని నింపుకోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లాలో వ్యాయామ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సొంత ఖర్చులతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డివిజన్ స్థాయి గేమ్స్ ను నిర్వహించారు. స్పోర్ట్స్ నిర్వహణ, క్రీడాకారులకు భోజనాలు ఏర్పాట్లు, క్రీడా దుస్తులు, ప్రైజులు తదితర ప్రతిదీ అన్ని తానే నిర్వహించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ . అనంతరం ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సలిం షరీఫ్,స్కూల్ గేమ్స్ సమాఖ్య జిల్లా కార్యదర్శి అజాంబాబా, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, డివిజన్ అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ప్రకాష్, కార్యదర్శి నాగేశ్వరావు, ఎమ్మార్వో నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు రమేష్, రాజేష్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు , క్రీడా అభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.