•టీ-పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ భోజ్జు పటేల్...ఉట్నూర్ : క్రీడలతో పాటు ఉన్నత చదువులు చదువుకోవాలని టీ-పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ భోజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని తాండ్ర గ్రామ పంచాయతీ పరిధిలోని హోల్ వాడి గ్రామంలో జై హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివాసీ యువత క్రీడలతోపాటు ఉన్నత చదువులపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. సమాజంలో గొప్ప స్థాయిలో నిలవడానికి చదువు ఒక్కటే మార్గమని అన్నారు. ఆదివాసీ యువత అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తుల అధ్వర్యంలో వేడ్మ భోజ్జు పటేల్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ దుర్వ దేవురావు,సర్పంచ్ కొత్మ బాయి,ఉప సర్పంచ్ పేందుర్ బాలు,ఎంపీటీసీ రవీందర్,గ్రామస్తులు దిలీప్, పుండలిక్,సాగర్, మహదు,సుదర్శన్,మారుతి, రమేష్,తదితరులు పాల్గొన్నారు.