
badrachalam news
గత ప్రభుత్వ నిర్ణయాల అమలుపై సమక్షించాలి
టీ.బీ హాస్పటల్ ముందు సిపిఎం ధర్నా
భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న క్షయ నిర్ధారణ పరీక్షా యంత్రాలను గత ప్రభుత్వం నిర్ణయం మేరకు కొత్తగూడెం మెడికల్ కళాశాలకు తరలించడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో టీబీ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ శ్రీనివాసరావు గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నరసారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాలకు కేంద్రబిందువుగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గిరిజన గిరిజన పేద ప్రజలకు టీబీ వైద్యం అందుబాటులోకి తేవడం కోసం నాటి ఎమ్మెల్యే కుంజా బుజ్జి కృషి ఫలితంగా టీ.బీ హాస్పిటల్ ను భద్రాచలంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఫలితంగా వేలాదిమంది క్షయ రోగులు పరీక్షలు నిర్వహించుకోవడం, తగు వైద్యం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నేడు టీ.బి హాస్పిటల్ లోని పరీక్షా యంత్రాలను జిల్లా మెడికల్ హాస్పిటల్ కు తరలించాలని గత బి అర్.యస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని అన్నారు. ఈ అంశంపై గెలిచిన ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతర పేద ప్రజలు పెద్ద సంఖ్యలో క్షయ వ్యాధికి గురవుతున్నారని వారికి అందుబాటులో ఉన్న ఈ వైద్య పరికరాలను, తరలించడం తక్షణమే నిలిపివేయాలని సిపిఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించి భద్రాచలం కేంద్రంగానే టీబీ వైద్య పరీక్షలను యంత్రాలను ఉంచాలని ఈ ప్రాంత ప్రజలకు టీబీ వైద్యాన్ని అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై వెంకట రామారావు, పారేల్లి సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి సీతామహాలక్ష్మి, ఎన్ నాగరాజు, ఎంవీఎస్ నారాయణ, మాజీ ఎంపీటీసీ చేగుండి శ్రీనివాస్, శాఖా కార్యదర్శులు డి రామకృష్ణ ,బి ధర్మారావు, కాకా రమణ, కొరసా రవి తదితరులు పాల్గొన్నారు.