
సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్
సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్
ఖమ్మం త్రీ టౌన్; ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ ప్రభుత్వాన్ని కోరారు
స్థానిక ఖమ్మం త్రీ టౌన్ గుమస్తాల సంఘ భవనం లో సిపిఎం త్రీ టౌన్ కమిటీ, శాఖ కార్యదర్శుల సమావేశం 31 డివిజన్ కార్పొరేటర్ యర్రా గోపి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన వై విక్రమ్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గత నెల రోజుల్లో గా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి వెళ్లి సర్వేలు చేయడం జరిగిందని ఈ సర్వేలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయని సైడ్ డ్రైనేజీ, పెన్షన్లు ఇండ్లు, ఇంటి స్థలాలు పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు ఖమ్మం త్రీ టౌన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఖమ్మం నగరంలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ప్రజల ను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, సిపిఎం త్రీ టౌన్ కార్యదర్శి బుక్య శ్రీనివాసరావు త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు పత్తిపాక నాగసులోచన యర్రా రంజిత్, ఎస్ కే ఇమాము, బండారు వీరబాబు, శీలం వీరబాబు, ఎస్కే సైదులు యర్రా మల్లికార్జున, త్రీ టౌన్ కమిటీ సభ్యులు పోతురాజు జార్జి, ఎస్ కే బాబు, రంగు హనుమంత చారి ,సారంగి పాపారావు, వేల్పుల నాగేశ్వరరావు చీకటిమల్ల శ్రీనివాస్ రావు ఎస్ కే అమీనా కన్నే కంటి శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు