ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులలో సీనియర్ మేట్లను నియమించాలి
Uncategorizedసీనియర్ మేట్ల సర్వీసును ప్రభుత్వం గుర్తించాలి
ప్రత్యేక అలవెన్స్ కింద నెలకు 10000 రూపాయలు ఇవ్వాలి
బి ప్రసాద్ గ్రామీణ ఉపాధి హామీ మెట్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ మెట్ల సర్వీసును ప్రభుత్వం గుర్తించి ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులలో వారిని నియమించాలని అప్పటివరకు ప్రత్యేక అలవెన్స్ కింద నెలకు పదివేల రూపాయలు వేతనం చెల్లించాలని గ్రామీణ ఉపాధి హామీ ట్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
మెదక్ జిల్లా కేంద్రంలో సీనియర్ మేట్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమలవుతున్న గ్రామీణ ఉపాధి హామీ పనిని గ్రామాలలో విజయవంతంగా అమలు చేసే దానిలో సీనియర్ మెట్లు పాత్ర కీలకమైనదిగా ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్ కంటే ఎక్కువ పనిని చేస్తున్నారు గ్రామాలలో వర్క్ ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఉపాధి కూలీలకు అందజేయడం పని ప్రదేశంలో పనిని మార్కింగ్ చేయడం కూలీలను కని ప్రదేశానికి తీసుకురావడం వచ్చిన వారికి మస్టర్ వేయడం పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ఎండిఓ ఆఫీసులో సిస్టంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే సరిచేసి కూలీల జాబ్ కార్డును వేతనాలను ఇప్పించడం పని ప్రదేశంలో కూలీలకు దెబ్బలు తగిలితే లేదా వడదెబ్బ తగిలితే మందులు ఇప్పించి వైద్యం చేపించడం పై నుండి అధికారులు పని ప్రదేశాలను సందర్శన చేస్తే దగ్గరుండి రికార్డులను చూపించడం వంటి అనేక పనులను చేస్తున్నారు ఇన్ని పనులు చేస్తున్న సీనియర్ మేట్లకు ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు ఎండిఓ ఆఫీసులో ప్రత్యేక మీటింగ్లు అంటే సొంత చార్జీలతోని వెళ్లి వస్తున్నారు పనిచేసే కూలీలు వేర్వేరు ప్రాంతాలలో ఉంటే వారి దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా మాస్టర్ వేయడం పని మర్కింగ్ వేయడం వంటివి చేసి వస్తున్నారు దీనికోసం రాను పోను చార్జీలు ఇద్దరు ఖర్చులను కూడా వ్యక్తిగతంగా సీనియర్ మేట్స్ భరిస్తున్నారు అయినా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహకారం కూడా ప్రభుత్వం అందించడం లేదు కొన్నిసార్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నాగాని మొత్తం పనులను సీనియర్ మెట్ల ద్వారానే చేపిస్తున్నారు జిల్లా కలెక్టర్ తక్షణం వీటిని పరిశీలన చేసి కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలలో సీనియర్ మేట్లుగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం కొన్ని చోట్ల అనారోగ్య కారణాలవల్ల చనిపోయిన వారు పనిలో లేనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ఆ కాళీ ప్లేస్ లలో సీనియర్ మేట్లుగా ఉన్న వారిని ప్రమోట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అనేక గ్రామాలలో జాబ్ కార్డులలో ఉన్న 100 రోజులు పనులు పూర్తి కావడం వలన చాలామంది సీనియర్ మెట్లు హరితహారం మొక్కలు కాపాడే వాచెస్ ప్రభుత్వం పనిని నమ్ముకుని ఫ్రీగా వాళ్ల సేవలను అందిస్తున్నారు ఇలాంటి వారికి పని కొనసాగాలంటే కుటుంబానికి ఒక జాబ్ కార్డు సిస్టన్ని ఎత్తివేసి మనిషికి ఒక జాబ్ కార్డును ఇచ్చి 200 రోజులు పనిని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం పట్టణ ప్రాంతాలలో కలిసిన గ్రామాలన్నీటికి ప్రత్యేక ఉపాధి పనిని పెట్టాలని కోరుతున్నాం
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె మల్లేష్ తో పాటు సీనియర్ మెట్ల నాయకులు మల్లేశం సురేష్ నితిన్ రాజేందర్ నరేష్ లావణ్య లక్ష్మి లహరి స్వామి తదితరులు పాల్గొన్నారు