*ముహమ్మద్ అహ్మద్ పాషా నియామకం* జఫర్ఘడ్ నవంబర్ 22 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన ముహమ్మద్ అహ్మద్ పాషా ను ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం జమాత్ యూత్ అధ్యక్షునిగా నియమిస్తూ జాతీయ యూత్ అధ్యక్షుడు కె.తారీక్ అహ్మద్ (ఖాదియాన్ పంజాబ్)ఉత్తర్వులు జారీ చేసినట్లు మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షులు ముహమ్మద్ సలీం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అహ్మద్ పాషా అహ్మదీయ ముస్లిం జమాత్ యొక్క సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం,మరియు నిబద్ధత కలిగిన కార్యకర్తగా జమాత్ అభివృద్ధికి పాటు పడటం చూసి నియమించడం జరిగిందని తెలిపారు. నిబద్ధతతో పని చేసే వారికి జమాత్ సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. నూతన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అహ్మద్ పాషా మాట్లాడుతూ.. నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు తారీక్ అహ్మద్ కు మరియు నియామకానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.యువత సన్మార్గంలో నడుస్తనే సమాజం బాగుపడుతుందని,యువత సంస్కరణ జరుగనిదే సమాజ సంస్కరణ జరుగదని కావున అహ్మదీయ ముస్లిం జమాత్ యువకులను ఐక్యమత్యం చేసి సమాజ సంస్కరణకు కృషి చేస్తా అని అన్నారు.