గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ,ఎమ్మెల్యే
కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గట్టమ్మ తల్లిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే,మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో),అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి,శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని,అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు,స్థానిక ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు