గణపతి నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి డీజే లు పెట్టకూడదని,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ధర్మసాగర్ సిఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.ఏవైనా అవాంచనీయ సంఘటనలకు జరిగితే పూర్తి బాధ్యత వినాయక మండలి నిర్వాహకులు వహించాలని అన్నారు.నిమజ్జన ఊరేగింపులో భాగంగా పోలీస్ వారికి సహకరించగలరని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్మసాగర్ పోలీసు వారికి సహకరించాలని కోరారు.