గణేష్ ఉత్సవ శోభాయాత్ర,నిమజ్జనంకు సర్వం సిద్ధం
Mahabubabadజిల్లా లో నిజాం చెరువులో రేపు జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్,ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, పాల్గొని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నేడు జరగబోయే గణేష్ ఉత్సవ శోభాయాత్ర, నిమజ్జనం, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు,
పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికలతో ఉన్నారని, షెడ్యూల్ ప్రకారం గణేష్ నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయుటకు సిబ్బంది అందరూ వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని ఆదేశించారు, చెరువు వద్ద గజఈత గాళ్లను, లైఫ్ జాకెట్లు, బోట్లు సిద్ధంగా ఉంచామన్నారు,మున్సిపల్ పరిధి, గ్రామాలలో సూచించిన చెరువులలో మాత్రమే నిమజ్జనం చేయాలన్నారు,
పోలీస్,మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, తదితర శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు,ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్, డీఎస్పీ తిరుపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్న, మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ డిఈ ఉపేందర్, స్థానిక తహసిల్దార్ భగవాన్ రెడ్డి, విద్యుత్ డిఈ విజయ్, సంబంధిత అధికారులు ఉన్నారు.