ఈ69 న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఖిలా వరంగల్ మండలంలోని గణేష్ నగర్ రోడ్ నెంబర్ 7 లోని సీసీ రోడ్లు లేని మట్టి రోడ్లను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డేపల్లి ప్రకాష్ సందర్శించి పరిశీలించారు.వారితో పాటు రిటైర్డ్ ఆర్ఎస్ఐ సీనియర్ నాయకులు శివకుమార్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క కొమురెల్లి యాదవ్ సీనియర్ నాయకులు దశరథం డివిజన్ నాయకులు రాజశేఖర్ మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు.
