
గన్నచుక్కమ్మ మృతి బాధాకరం
గన్నచుక్కమ్మ మృతి బాధాకరమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని ,కలకోవ గ్రామ ఎంపీటీసీ గన్న భవాని నరసింహారావు తల్లి చుక్కమ్మ మృతి చెందగా,మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంక అజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు తొగర్ రమేష్, సొసైటీ చైర్మన్ కందిమండ సత్యనారాయణ, బిఆర్ఎస్ నాయకులు ఎలక నరేందర్ రెడ్డి, రామకృష్ణ, స్థానిక సర్పంచ్ సుజాత వీరబాబు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు