గన్ని బ్యాగుల సమస్యతో పొద్దుతిరుగుడు కేంద్రాలలో కొనుగోలుకు ఆటంకం.
Siddipet- సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘం బృందం పొద్దు తిరుగుడు పంట చేతికి వచ్చి, 3 వేల బస్తాల విత్తనాలను అమ్ముకుందామని రైతు మార్కెట్ తీసుకొస్తే గన్ని బ్యాగులు లేక కొనుగోలు చేయడం లేదని రైతులు తమ ఆవేదనను రైతు సంఘం బృందానికి చెప్పుకున్నారు. గత వారం, 15 రోజుల నుండి పొద్దు తిరుగుడు పంటను అమ్మడానికి మార్కెట్ కు తెస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యారని చెప్పారు. నాఫెడ్ సౌజన్యంతో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్యాక్స్ సిద్దిపేట వారు కొనుగోలు చేస్తారని బ్యానర్లు కట్టిన ఒక్క క్వింటాళ్ల నేటికీ కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పండిన పంటను రైతులు తక్కువ ధరలకే వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్యాక్స్ సిద్దిపేట కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలనీ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు.
సోమవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జిల్లా అధ్యక్షుడు చల్లారపు తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డీ, జిల్లా ఉపాధ్యక్షులు నక్కల యాదవ రెడ్డి, బద్దిపడగా కృష్ణారెడ్డి లు సందర్శించారు. అనంతరం శోభన్ మాట్లాడుతూ.. జిల్లాలో 11,202 ఎకరాలల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను వేశారు. ఒక ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు పొద్దు తిరుగుడు గింజలు వస్తాయి. ప్రభుత్వం క్వింటాలకు రూ.7,280 మద్దతు ధరను ప్రకటించింది. కానీ పంట చేతికి వచ్చి పంటను అమ్ముకోవడానికి రైతులు వ్యవసాయ మార్కెట్లలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వం ఇంకా కొనుగోళ్లను చేపట్టకపోవడంతో అక్కడ వ్యాపారస్తులు రూ.4,800 నుంచి రూ.5,200 క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో సుమారుగా రూ.2,000 నష్టపోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడిరది. నూనె పంటలను ప్రోత్సమించే ప్రభుత్వం, రైతులు పండిరచిన పంటను కొనుగోలుచేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు కానీ కొనుగోలు చేయడం మరిచారని అన్నారు. 20 వేల గన్నిబ్యాగులు అవసరం ఉంటే ఒక్క గన్ని బ్యాగు రాకపోవడం విడ్డూరం అని అన్నారు.
వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి వెంకటయ్య ను నిలదీయగా 2000 గన్ని బ్యాగుల రేపు వస్తాయని, రేపటి నుండి కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులకు మార్కెట్ నుండి చేయాల్సిన సహాయం చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు పట్టాల కనకయ్య, పరికపల్లి నర్సింహులు, గుండేళ్ళ ఎల్లయ్య, పుల్లూరు దేవేందర్, పొర్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.