
ఈ69న్యూస్ హన్మకొండ
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా అద నపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు.మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పిసి అండ్ పి ఎన్ డి టి అధారిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.ప్రతి ఒక్కరు చట్ట నియమాలను పాటించాలని,సక్రమంగా రికార్డులు నిర్వహించాలని,ప్రతి హాస్పటల్లో పిసి అండ్ పి ఎన్ డి టి చట్టానికి సంబంధించిన బోర్డును అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని,వైద్యాధికారులు రిజిస్టర్ అయిన కేంద్రాలనే కాక రిజిస్టర్ గాని ఆసుపత్రులను కూడా తనిఖీ చేయాలని అన్నారు.ప్రజలలో అవగాహన కల్పించేందుకు పబ్లిక్ స్థలాల్లో గోడ పత్రికలను ప్రదర్శించాలని,ప్రజలలో అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు,అంగన్వాడీ కార్యకర్తలు,ఏఎన్ఎంలు,ఆశాలు,ఎస్ హెచ్ జి గ్రూపులను కూడా భాగస్వాములుగా చేయాలన్నారు.వీరు గ్రామాల్లోని మహిళలకు అవగాహన కల్పించడమే గాక గర్భిణీ స్త్రీలపై దృష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ అప్పయ్య,డిఆర్డిఓ మీనా శ్రీను,డిడబ్ల్యుఓ జయంతి,కమిటీ సభ్యులు ఇవి శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ కరుణాకర్,ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల మరియు తదితరులు పాల్గొన్నారు.