
బీఆర్ఎస్ ఆనాటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హయాంలో శంకుస్థాపన..
బీఆర్ఎస్ ఆనాటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హయాంలో శంకుస్థాపన…
జనాభా ప్రతిపదికన ఇంటిగ్రెటెడ్ వెజ్-నాన్ వెజ్ 22డిసెంబర్ 2021 లో శంకుస్థాపన చేశారు.
4కోట్ల 50లక్షలతో దాన్ని మొదలుపెట్టారు.కానీ ఖర్చు చేసింది 80లక్షల వరకే
ఇప్పటి ఎమ్మెల్యే రేవూరి కుడా దాని జోలికి పోలేదు….
అక్కడి నుండే పనులు ప్రారంభిద్దాం అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు….
తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 20
హన్మకొండ జిల్లా
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చల్లా ధర్మారెడ్డి నేత్రుత్వంలో మొదలైన మార్కెట్ నిర్మాణ పనులు కానీ గత ప్రభుత్వం పూర్తిచేయలేక పోయారు. విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వాళ్ళు కొంత వరకే చేసి ప్రజాధనాన్ని దోచుకోవడం జరిగింది.నాలుగు కోట్ల యాభై లక్షలతో ఈ మార్కెట్ పనులు ప్రారంభించిన వారు ఖర్చు పెట్టింది కేవలం 80లక్షలలోపే…ఇలా ప్రజల సొమ్ముని ఇష్టరాజ్యాంగ వాడుకున్నారు. మార్కెట్ ఒక్కటే కాదు పరకాల బస్ స్టాండ్ ఎదురుగా చిరు వ్యాపారస్థుల డబ్బాలు ఉండే అక్కడ వాళ్ళను తీపించి షాపింగ్ మాల్ కాంప్లెక్స్ చేస్తామని దాన్ని గాలికి వదిలేసారు గోడలు లేపారు వదిలేసారు ఇప్పుడు అందులో మరుగుదొడ్లుగా వాడుతున్నారు. అలానే వంద పడకల హాస్పిటల్ అన్నారు దాన్ని అవే గోడలు వేసి వదిలేసారు.ఆ తరవాత కాంగ్రేస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రేస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచారు వాళ్ళైనా ఈ పనులు పూర్తి చేస్తారు అనుకుంటే వాళ్ళు దాన్ని పట్టించుకునే పాపాన పోలేదు. పరకాలకు ఏది అభివృద్ధి ఎవరు చేస్తారు అభివృద్ధి అనే సందేహంలో ప్రజలు.ఆ ప్రభుత్వం వస్తది ఈ ప్రభుత్వం వస్తది కానీ అభివృద్ధి జరగదు అంత దోచుకోవడం దాచుకోవడమేనా… నాయకుడి లక్షణం అని ప్రశ్నినిస్తున్నారు ప్రజలు.రెండు సంవత్సరాలు అయింది కాంగ్రేస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచి ఏం అభివృద్ధి జరిగిందని ప్రజల ఆవేదన.. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అవీ కుడా మధ్యలోనే ఆపేశారు మొరం,ఇసుక, దొరకక ఇలాంటి పరిస్థితుల్లో పరకాల ప్రజలు ఇబ్బుందులకు గురవుతున్నారు.ఆరు గ్యారెంటీలు అన్నారు అవ్వి అయినా అమలు అయ్యాయా అంటే అవి కుడా కాలేదు. వృద్దులకు వికలాంగులకు, వితంతువులకు పెంచుతామన్నా పెన్షన్ ఏది అని ప్రజల ఆవేదన… ఎక్కడుంది మీ అభివృద్ధి ఇదేనా మీ అభివృద్ధి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పరకాల అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు.