
telugu galam news e69news local news daily news today news
18 నెలల బకాయి వేతనాల కోసం ఐటిడిఏ పిఓ కు సమ్మె నోటీసు ఇచ్చిన హాస్టల్ వర్కర్లు* *సిఐటియు * గిరిజన కార్మికుల ఆకలి బాధలు ప్రభుత్వానికి కనపడటం లేదా గిరిజన సంక్షేమ శాఖ పోస్టు మెట్రిక్ హాస్టల్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన 18 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా ఆశ్రమ పాఠశాల లు హాస్టల్స్ యందు పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు రావలసిన ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఐటీడీఏ పీవోకు సమ్మె నోటీసులు తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్ మరియు ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి మాట్లాడుతూ గిరిజన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులు ఆర్థిక శాఖ అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు 18 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కార్మికులు వారి కుటుంబాలు ఎలా బతుకుతాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ఎన్నిసార్లు కమిషనర్ గారికి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గారికి కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు విన్నవించిన సమస్య పరిష్కారం కాలేదని బకాయి వేతనాలు చెల్లించలేదని విమర్శించారు చేసిన పనికి వేతనాలు చెల్లించకుండా నెలల తరబడి గిరిజన కార్మికుల తోటి ఐటీడీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుందని విమర్శించారు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలకు సంబంధించిన చెక్కు 2023 సెప్టెంబర్ 16వ తేదీన ఆర్థిక శాఖకు పంపించారని సెప్టెంబర్ 21వ తేదీన ట్రెజరీలో టోకెన్ నెంబర్ విడుదల చేశారని ఇప్పటివరకు డబ్బులు మాత్రం విడుదల చేయలేదని ఇంత అన్యాయంగా కార్మికుల జీతాలు చెల్లించకుండా పనులు చేయించుకోవడం ఒక గిరిజన సంక్షేమ శాఖలోని నడుస్తుందని విమర్శించారు వేతనాలు నెలనెలా చెల్లించాలని కనీస సామాజిక బాధ్యతను కూడా ప్రభుత్వంగానే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడం గిరిజన కార్మికుల సేవల పట్ల వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు 12,500 వస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలను అన్యాయంగా 9000 తగ్గించారని తిరిగి పెంచటానికి క్యాటరింగ్ ఏజెన్సీ సర్కులర్ మార్పు చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఆ సర్కులర్ను వేతనాలు పెంచుతూ ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు గిరిజన కార్మికుల పట్ల గిరిజన విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని వారి మూలంగా కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని సిఐటియు పేర్కొన్నది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో మూడుసార్లు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గారికి ఒకసారి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కనీసం కూడా వీరి సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు అవుట్సోర్సింగ్ కార్మికుల 18 నెలల బకాయి వేతనాలు చెల్లించడంతోపాటు ఔట్సోర్సింగ్ క్యాటరింగ్ ఏజెన్సీని రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జీవో ప్రకారం 15,600 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించడంతోపాటు 2021 2022 మరియు 2022 2023 ఆర్థిక సంవత్సరాలలో పెరిగిన జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్కులర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని సర్కులర్ విడుదలైన తేదీ నుంచి పాత ఏరియాస్ తో సహా చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలని పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిన కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ధర్నాలు చేసిన స్పందించని కారణంగానే నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సిఐటియు నాయకులు ప్రకటించారు ఫిబ్రవరి 16వ తేదీ లోపు బకాయి వేతనాలు చెల్లించాలని లేనియెడల ఫిబ్రవరి 16వ తేదీ తర్వాత ఏ క్షణం నుండైనా నిరవధిక సమ్మె చేస్తామని పేర్కొన్నారు సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం స్పందించిన ఐటీడీఏ పీవో ఔట్సోర్సింగ్ కార్మికులకు నాలుగు నెలల వేతనాలు ఐటీడీఏ నుండి చెల్లిస్తామని రాష్ట్రం నుండి రావాల్సిన బడ్జెట్ రిలీజ్ అయ్యేవిధంగా అధికారులతో మాట్లాడుతామని డైలీ వేజ్ వర్కర్లకు కూడా పెండింగ్ వేతనాలలో కొంతమేరకు చెల్లిస్తామని పూర్తిస్థాయిలో బడ్జెట్ వచ్చిన తర్వాత బకాయి మొత్తం క్లియర్ చేస్తామని పేర్కొన్నారు ఔట్సోర్సింగ్ కార్మికులకు క్యాటరింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని యూనియన్ కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు లేఖ రాస్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు అధికారులు హామీలు ఇవ్వడం తప్ప సమస్యలు పరిష్కారం చేయడం లేదని అందుకనే తాము సమ్మె చేయాలని బలంగా నిర్ణయించుకున్నామని సిఐటియు పేర్కొన్నది ఐటిడిఏ పిఓ ను కలిసి సమ్మె నోటీసులు వినతి పత్రాలు అందించిన వారిలో డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ నాయకులు ముత్తయ్య సమ్మక్క లక్ష్మి రాములమ్మ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రామా తిరుపతమ్మ నాగమణి దుర్గా లాలయ్యసరోజా తదితరులు పాల్గన్నారు.