
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రిన్సిపల్ ఎం. దేవదాసు బెస్ట్ ప్రిన్సిపాల్ గా ఎంపికై రిపబ్లిక్ డే రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న నేపథ్యంలో సోమవారం భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం ప్రిన్సిపల్ దేవదాసును ఘనంగా సన్మానించారు గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో వక్తలు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ పాఠశాల, కళాశాల బాలికలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. తమ పాఠశాల, కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ కు బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. సన్మాన గ్రహీత ప్రిన్సిపల్ ఎం దేవదాసు మాట్లాడుతూ… పాఠశాల, కళాశాలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం సమన్వయంతో వ్యవహరించి విద్యా ప్రగతికి దోహదం చేస్తున్నారని, విద్యార్థినిలు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని ప్రశంసించారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సి. బసవ కుమారి,ఎల్. సరస్వతి, సీనియర్ అధ్యాపకులు జోష్ణ, వసంత కుమారి, శారద, అరుణ కుమారి, జగన్మోహిని, జివిఎల్, రాంబాబు, వీరభద్రం, తోటమల్ల బాలయోగి,టీచర్స్ సరోజినీ, ఝాన్సీ, సుజాత, దుర్గ, అకౌంటెంట్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.