
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం ఐ.టి.డి ఏ మరియు గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించబడుతున్న గిరిజన బి.ఎడ్, కళాశాల ప్రిన్సిపాల్ గా డా. వీరు నాయక్ ను ఐ.టి.డి ఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతిక్ జైన్ సోమవారం నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 31 సంవత్సరాలుగా పనిచేస్తున్న డా. వీరు నాయక్ గతంలో గిరిజన బి.ఎడ్, కళాశాల స్థాపన నుండి 8 సంవత్సరాలు అధ్యాపకునిగా పని చేసారు. గిరిజన సంక్షేమ శాఖ లో సుధీర్గ అనుభవం కలిగిన డా. వీరు నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో p.hD;, పూర్తి చేసిన మొట్టమొదటి,ఏకైక అభ్యర్ధి కావడం విశేషం. డా. వీరు నాయక్ కు నియామక ఉత్తర్వును ప్రాజెక్ట్ అధికారి అందిస్తూ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా డా. వీరు నాయక్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి గిరిజన బి.ఎడ్, కళాశాల స్థాపన జరగడం గిరిజనుల అదృష్టం అని , అటువంటి కళాశాలలో స్థాపన సమయంలో పనిచేసిన అనుభవం ఉందని, ఆ అనుభవంతో మరియు గౌరవ అధికారుల సహాయ సహకారాలతో కళాశాలను మరింత ప్రతిష్టాత్మకoగా నిర్వహిస్తామని తెలియజేసారు. గిరిజన విద్యార్దులకోసం ఉపాధ్యాయ శిక్షణను మరింత వినూత్నంగా అభివృద్ధి చేసి కళాశాల పేరు ప్రతిష్టలను పెంపొందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేస్తానని చెప్పారు. దేశంలోనే ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న గిరిజన బి.ఎడ్, కళాశాలకు ప్రిన్సిపాల్ గా అవకాశం కల్పించిన ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ కు, డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది మరియు విద్యార్ధులు నూతన ప్రిన్సిపాల్ గా నియమించబడిన డా.వీరు నాయక్ కు స్వాగతం పలికారు.