గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ ఉత్సవం ప్రతీకగా నిలుస్తుందని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు,గురువారం గోవిందరావు పేట మండలం బాలాజీ నగర్ గ్రామంలో తీజ్ ఉత్సవాలలో తస్లీమా పాల్గొన్నారు,గిరిజన సంప్రదాయ పద్ధతిలో మొలకెత్తిన నారు తలపైన పెట్టుకొని వారితో కలిసి నృత్యం చేశారు,అనంతరం తస్లీమా మాట్లాడుతూ గిరిజనులు నియమ,నిష్ఠలతో ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తీజ్ ఉత్సవాలు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తాయని తస్లీమా అన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపిటిసి దారవత్ గాంగు పూర్ణ,పడియా రాజు,ధారవత్ ఉష,భూక్యా మీటు,సారయ్య, బాలు నాయక్,స్వామి నాయక్,చంద్ర కాంత్, గ్రామస్థులు పాల్గొన్నారు.