
telugu galam news e69news local news daily news today news
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గురుకులం బాలికల హవా పరీక్ష రాసిన 35 మందిలో 18 మంది మెయిన్స్ కు అర్హత పొందిన గిరి బిడ్డలు అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ భద్రాచలం గిరిజన గురుకుల బాలికలు తమ ప్రతిభ చాటారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో గిరి బిడ్డలు మెరిశారు. విడుదలైన పరీక్ష ఫలితాల్లో ర్యాంకుల పంట సృష్టించారు. ఈ ఏడాది భద్రాచలం గిరిజన గురుకులానికి చెందిన 35 మంది ఎంపీసీ బాలికలు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. మంగళవారం విడుదలైన జేఈఈ పరీక్ష ఫలితాల్లో ఈ 35 మంది బాలికల్లో 18 మంది జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు క్వాలిఫై కావటం గమనార్హం. ఇందులో డి ఐశ్వర్య 79.065, కే శ్రావణి 74.57, ఇర్ఫాస్వాంజిత 68.2, టి సింధు 67.83 శాతం ఫలితాలు సాధించారు. భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల నుంచి హాజరైన 35 మంది గిరిజన బాలికల్లో 18 మంది జేఈఈ మెయిన్స్ అర్హత సాధించి అడ్వాన్స్ కు క్వాలిఫై అవ్వటం అభినందనీయమని, గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ ఎం దేవదాసు పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో జరిగిన సమావేశంలో జేఈ మెయిన్స్ లో సత్తా చాటిన గిరి బిడ్డలను ఆయన అభినందించారు. భద్రాచలం ఐటిడిఏ పిఓ శ్రీ ప్రతీక్ జైన్ ప్రత్యేక శ్రద్ధ మరియు ఆర్.సి.ఓ. టి.వెంకటేశ్వర రాజు ప్రోత్సాహం, గిరిజన గురుకుల సొసైటీ అధికారుల పర్యవేక్షణ, అంకిత భావంతో పాఠాలు బోధించిన లెక్చరర్ల కష్టం, గిరిజన బాలికలు చదువులో రాణించటానికి దోహదపడుతోందని అన్నారు. గతంలో కూడా ఇదే కళాశాల నుంచి1 ఐఐటి,12 ఎన్ఐటీలు,1 జి.ఎఫ్.టి.ఐ,1 ట్రిపుల్ ఐటి,1 ఐజర్,1 ఎంబీబీఎస్ సీట్లను భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల బాలికలు సాధించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.