
ఈ69న్యూస్ హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని గుండ్లసాగరం గ్రామంలో విశేషంగా మూడు తరాల ఆడపడుచులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.కుటుంబ బంధాలను మరింత గాఢతరం చేసుకునేందుకు,పెద్దలు-చిన్నలు అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హృదయపూర్వకంగా కబుర్లు చెప్పుకున్నారు.తరం తరంగా సాగుతున్న సాంప్రదాయాలు,కుటుంబ అనుబంధాల గురించి పెద్దవారు చిన్నవారికి వివరించి స్ఫూర్తినిచ్చారు.అంతేకాక,చిన్నవారు కూడా తమ అనుభవాలను పంచుకుంటూ వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితంగా మార్చారు.సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణ డిజే మ్యూజిక్.పాటల సవ్వడికి వయసు మరచి పెద్దలు కూడా అడుగులు వేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు.చిన్నారుల నుంచి యువతులు,మధ్య వయస్కుల నుంచి వృద్ధ మహిళల వరకు అందరూ నృత్యాల్లో పాలుపంచుకుని క్షణాలను స్మరణీయంగా మార్చుకున్నారు.గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మూడు తరాల ఆడపడుచులు కలసి సమ్మేళనం జరపడం ఇదే తొలిసారి కావడంతో పాల్గొన్నవారంతా హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ బంధాలు బలపడటమే కాకుండా,గ్రామంలోని ఆడపడుచుల ఐక్యతకు ఇది నిదర్శనమని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో గ్రామ మహిళలంతా సమిష్టిగా కృషి చేయడం విశేషం.చివరగా అందరూ ఒకే వేదికపై కలిసి భోజనం చేసి,మళ్లీ ఇలాంటివి తరచుగా నిర్వహించుకోవాలని కోరుకున్నారు.