గుడ్డివారీగా వ్యవహరిస్తున్న చర్ల రెవిన్యూ అధికారులు
3 నెలలుగా ఆక్రమణకు గురవుతున్న కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమినీ కాపాడండి అని యంత మొత్తుకున్నా పట్టింపు లేకుండా ఉన్న చర్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి
ప్రభుత్వ భూమిని ఆక్రమించిన సదరు వ్యక్తులకు రెవెన్యూ వారు ఇప్పటివరకు ఏ నోటీసులు ఎందుకు జారీ చేయలేదు
ప్రభుత్వ భూమి ఆక్రమించిన వ్యక్తులపై ఇప్పటి వరకు రెవిన్యూ వారూ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించారని తెలిసినా కూడా గ్రామపంచాయతీ అధికారి తను ఇచ్చిన నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ని ఎందుకు రద్దు చేయడం లేదు
చర్ల విద్యుత్ అధికారులు ప్రభుత్వం భూమిలో ఇల్లు నిర్మించారని తెలిసినప్పటికీ కరెంటు మీటర్ ని ఎందుకు తొలగించడం లేదు
జరుగుతున్న ఈ నిర్లక్ష్యం కారణంగా సంబంధిత రెవెన్యూ గ్రామపంచాయతీ విద్యుత్ శాఖల అధికారులు లంచం తీసుకున్నారేమో అని అనుమానాలు కలుగుతున్నాయి
ఈ విషయమై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి సిబిఐ విచారణ జరిపించాలి
ఆక్రమణకు గురైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిని కాపాడి ఆలయ కమిటీకి ఆ భూమిని అప్పగించాలి
ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టరీత్య చర్యలు తీసుకోవాలి
ఆలయానికి కేటాయించిన ప్రభుత్వ భూమి రక్షణకై ఈనెల 6 తారీఖు నుండి దీక్షలు చేపడతాం
ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా
CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ డివిజన్ నాయకుడు కొండా చరణ్
చర్ల మండలంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న పార్టీ డివిజన్ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ చర్ల మండల రెవెన్యూ అధికారుల వైఖరి దద్దమ్మల వలె గుడ్డి వారి వలె ఉందని విమర్శించారు గత మూడు నెలలుగా కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆ భూములను కాపాడాలని చెబుతున్న కనీసం పట్టించుకోవడంలేదని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడం చేతకాకపోతే ఉద్యోగాలు మానేయాలని అన్నారు కనీసం ఆక్రమణదారులకు ఇప్పటివరకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు ఆక్రమణదారుల పట్ల రెవెన్యూ అధికారులు ఎందుకు మెతక వైఖరిగా ఉంటున్నారనేది తెలియపరచాలని కోరారు చర్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి తన ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టుకున్న ఇళ్లకు వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తున్నాడని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు గ్రామపంచాయతీ కార్యదర్శి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం వల్లనే ఆక్రమంగా నిర్మించిన ఇళ్లకు విద్యుత్ అధికారులు కరెంటు మీటర్లు ఇచ్చారని అన్నారు ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించి కట్టుకున్నారని తెలిసినప్పటికీ రెవెన్యూ వారు ఎందుకు ఆ భూమిని స్వాధీన పరచుకోవడం లేదని పంచాయతీ వారు ఎందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను రద్దు చేయడం లేదని విద్యుత్ అధికారులు ఎందుకు కరెంటు మీటర్లని వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించారు జరుగుతున్న ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈ జాప్యాన్ని పరిశీలిస్తే సంబంధిత ఈ శాఖల అధికారులు ఆక్రమణదారుల వద్ద లంచాలు తీసుకున్నారేమో అని అనుమానాలు కలుగుతున్నా అని అన్నారు ఈ విషయంలో కలెక్టర్ స్పందించి జోక్యం చేసుకొని సిబిఐ విచారణ చేసి నిజనిర్ధారణ తేల్చాలని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు పెట్టాలని కన్యకా పరమేశ్వరి దేవి కి సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆ భూమిని ఆలయ కమిటీ అప్పగించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఈనెల ఆరవ తారీకు నుండి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూములను కాపాడేందుకు దీక్షలు నిర్వహిస్తామని తాడోపేడో తేల్చుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ చర్ల మండల పార్టీ నాయకులు చెన్నం మోహన్ మెహమదా పార్టీ నాయకులు పున్నారావు నాగరాజు సోమరాజు విష్ణు తదితరులు పాల్గొన్నారు