
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
ఈ69న్యూస్ హనుమకొండ
గురుకులాల్లో నాణ్యమైన భోజనం,పరిశుభ్రత,టాయిలెట్ల నిర్వహణ బాగుండే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ గురుకులాలు,కస్తూరిబా విద్యాలాయాల్లో ఫుడ్ సేఫ్టీ,వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనుల పై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో మొత్తం 110 గురుకులాలు ఉన్నాయని,భోజనం,ఇతర వసతులను జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని జిల్లా రెవెన్యూ అధికారి వై. వి.గణేష్ కలెక్టర్ కు వివరించారు.గురుకులాల్లో తాగునీరు,టాయిలెట్స్,మెష్ డోర్స్,కాంపౌండ్ వాల్స్,ఇతర మౌలిక వసతుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.వివిధ గురుకులాల్లో సమస్యలు కలెక్టర్ అడిగి తెలుసుకుని వాటి పరిష్కరానికీ తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..గురుకులాల్లో కల్పిస్తున్న వసతుల పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.గురుకులాల్లోని అన్ని వసతులు బాగుండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.గురుకుల విద్యాలయాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలన్నారు.గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజనం మెనూ ప్రకారం నాణ్యతగా అందించాలని,బియ్యం,పాలు,కూరగాయలు,ఇతర సరకులు నాణ్యతగా ఉండాలన్నారు.మైనర్ రిపేర్లను త్వరగా పూర్తి చేయాలన్నారు.మిషన్ భగీరథ ద్వారా గురుకులాలకు నీటి సరఫరా జరగాలన్నారు.సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.మెనూ ప్రకారం నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రత,టాయిలెట్ల నిర్వహణ బాగుండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఈవో వాసంతి,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య,పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ మహేందర్,జిల్లా సంక్షేమ అధికారి జయంతి,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీలత,వివిధ గురుకులాల అధికారులు పాల్గొన్నారు.