
జనగాం గొర్రెల పంపిణీకి సరిపడా నిధులు కేటాయించి,నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 9న రాష్ట్ర పశుసంవర్థక శాఖ కార్యాలయాన్ని ముట్టడికి వేలాది మంది గొల్ల కురుమలు తరలి రావాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (GMPS) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోటే దేవేందర్. సాదం రమేష్ లు పిలుపునిచ్చారు.శుక్రవారం జనగాం జిల్లా కేంద్రంలోని బీరప్ప గుడి ఆవరణలో పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ సంధర్భంగా సాదం రమేష్ మాట్లాడుతూ జూన్ 9వ తేదీన రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్లు హడావిడి చేసి అందరికీ గొర్రెలిస్తామని నమ్మించి జనగాం జిల్లా వ్యాప్తంగా 4499 మందికి ఇవ్వాల్సి ఉండగా 2700 మంది DD లు తీసి ఐదు నెలల్లో కేవలం 365 మందికి మాత్రమే పంపిణీ చేశారు.జిల్లాలో సుమారు 2700/ మంది గొల్ల కురమలు ₹43750 చొప్పున డీడీలు తీసి ₹118.125.000/ రూపాయలు ప్రభుత్వ ఖాతాలో జమ చేసి
ఎదురుచూస్తున్నారని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ వస్తే నిధులు విడుదల చేసే అవకాశం లేనందున మిగిలిన 2335/ మంది తమ పరిస్థితి ఏంటని గొల్ల కురుమలు ఆందోళన చెందుతున్నారన్నారు.పక్క రాష్ట్రాల్లో గొర్రెల అమ్మిన రైతుకు ఒక్కొక్క యూనిట్ కు ₹158000 ఇవ్వాల్సి ఉండగా కేవలం లక్ష రూపాయలు. 80 వేల రూపాయలు.ఇవ్వటం వల్ల ముసలివి,పండ్లు లేనివి,నాణ్యత లేని నాసిరకం గొర్లు,చిన్నపిల్లలనే ఎక్కువ చోట్ల ఇచ్చారని ఆరోపించారు.పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి అక్కడ గొర్రెలు లేకుండానే తిప్పి తిప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ముందు డి.డి.లు కట్టిన వాళ్లను కాకుండా ఎమ్మెల్యేలు సూచించిన లబ్దదారులను పంపిస్తున్నారని ఆరోపించారు.ఎన్సీడీసీ అప్పు ఇవ్వలేమని చేతులెత్తేసినందున, రాష్ట్రంలో ఇంకా మిగిలిన 3.5లక్షల మందికి కావలిసిన 6వేల కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రత్యేకంగా ఇచ్చి నగదు బదిలీ చేసి గొర్లకాపరులకు నచ్చినచోట ఇష్టమొచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే GMPS ఆధ్వర్యంలో దశలవారిగా అనేకసార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల తప్పని స్థితిలో అక్టోబర్ 09న రాష్ట్ర పశుసంవర్థక శాఖ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని నిర్ణయించించామని తెలిపారు.ఈ కార్యక్రమానికి గొల్లకురుమలు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.దేవరుప్పుల మండల అధ్యక్షులు బుమాండ్ల కుమారస్వామి లింగాల ఘనపూర్ మండల కన్వీనర్ కర్రే కృష్ణ ఉన్నారు.