jangaon news
రఘునాధపల్లి : తెలుగు గళం న్యూస్ /
మండలకేంద్రంలోని కురుమ సంఘం భవనంలో శ్రీ బీరప్ప గొర్రెల మేకల పెంపక దారుల సంఘం (ఫెడరేషన్)ఎన్నికల్లో భాగంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా శ్రీ బీరప్ప గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం నూతన అధ్యక్షుడిగా పేర్ని రవి కురుమ , ఉపాధ్యక్షుడిగా బడితే శ్రీనివాస్ , కార్యదర్శిగా మరాటి జంపయ్య , డైరెక్టర్ లుగా పేర్ని వెంకటేష్ ,పేర్ని నాగరాజ్,పేర్ని అనిల్,ద్యావర రాజు,పేర్ని ప్రసాద్, పెర్నె లెనిన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం ఎన్నికల అధికారి జిల్లా కోపరేటివ్ సూపరిండెంట్ వేణుగోపాల్, ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండా వెంక టయ్య,మాల్ల యాకయ్య ,మాయ రాములు,పేర్ని నరసింహులు, గుండ కుమార్,కొలుపుల నాగ రాజు,పేర్నె అనిల్,పెర్నె వీర స్వామి,ద్యావర కుమారస్వామి, పోచబోయిన మల్లేష్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.