
గోపాలస్వామి మృతి బాధాకరం
మండల కేంద్రం లోని రత్నవరం గ్రామానికి చెందిన గోపాల స్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే మలయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం గోపాల స్వామి మృతదేహానికి ఎమ్మెల్యే పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. గోపాలస్వామి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.