
గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా మెరుగు బాపన్న
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట గ్రామ గౌడ సంఘం నూతన కమిటీ బుధవారం ఎన్నికైంది.భాగిర్తిపేట గ్రామంలోని ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో గౌడ కులస్తులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడుగా మెరుగు బాపన్న,ఉపాధ్యక్షుడుగా ఆకుల శ్రీనివాస్,కార్యదర్శిగా బొనగాని తిరుపతి,కార్యవర్గ సభ్యులుగా శ్రీపతి భిక్షపతి (చిన్న),మాటూరి తిరుపతి, బుర్ర రవి, శ్రీపతి రాజు, శ్రీపతి సదయ్య, శ్రీపతి మొగిలి.ఈ సందర్భంగా గౌడ కులస్తుల ఐక్యత, అభివృద్ధి, సామాజిక సేవ దిశగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ సమావేశంలో గౌడ కులస్తులు,గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.