
కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టించి 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న జల పూజోత్సవం కార్యక్రమంలో జలబిందెతో ఊరేగింపుగా వచ్చి నాభిశిలకు జల పూజోత్సవం చేసిన ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని గ్రామ ప్రజలను చల్లగా దీవించి కాపాడే చల్లని దేవత గ్రామ రక్షక కవచంలా కాపు కాసే బొడ్రాయి తల్లి అని గ్రామ దేవతలను పూజించడం తెలంగాణ సాంప్రదాయంలో భాగమని గ్రామ దేవతలు మనకి శ్రీరామ రక్ష అని గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టించి 12 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఆ నాభిశిలకు జల బిందెలతో జల పూజోత్సవం చేయడం శుభ పరిణామమని ఆ తల్లి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుభీక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సురేష్, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సోమపంగు అంబేద్కర్, మండల మహిళా అధ్యక్షురాలు నర్సింగోజు గీత,పద్మ, పోయిలపంగు బిక్షం, అప్ప కొండ,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.