గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి
Suryapetగ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని శనివారం అనంతగిరి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ మండల నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ప్రమాదం జరిగిన కార్మికుని కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని అన్నారు కారోబర్ మరియు బిల్ కలెక్టర్ ను సహాయ కార్యదర్శులుగా నియమించాలని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆదివారం పండుగ సెలవులు జాతీయ సెలవు దినాలను అమలు చేయాలని కోరారు 11వ పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ పే 1900 రూపాయల వేతనంగా చెల్లించాలని ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 వేతనం పంప్ ఆపరేటర్లకు ఎలక్ట్రిషన్లకు డ్రైవర్లు కారోబర్ బిల్ కలెక్టర్లకు నిర్ణయించాలన్నారు ఈ కార్యక్రమంలో ఇరుగు సత్యనారాయణ సోమపొంగు రామకృష్ణ గుండు సురేష్ డేగ అనుమంతు నెమ్మది ఉపేందర్ హనుమంతు భాస్కర్ వెంకటేశ్వర్లు పద్మ శ్రావణ్ కిరణ్ మట్టపల్లి వీరబాబు ప్రసాదు రాములు చందర్రావు ఉపేందర్ నరసయ్య వెంకటేశ్వర్లు ఎర్రయ్య తమలపాకుల విజయ్ నాగరాజు సతీషు తదితరులు పాల్గొన్నారు