
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సిసి రోడ్లు శంకుస్థాపన
- ప్రజల క్షేమం కొరకే అభివృద్ధి
- గ్రామ పార్టీ అధ్యక్షులు ఊడుగుల వెంకన్న
గళం న్యూస్ డోర్నకల్:-
సిరోల్ మండలం చిలుక్కోయాలపాడు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊడుగుల వెంకన్న ఆధ్వర్యంలో సిసి రోడ్ల శంకుస్థాపన చేసిన సీరోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి. గ్రామంలోని సీసీ రోడ్ల శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరిగిందని, పట్టణాలు, పల్లెలోని ప్రతీ వీధిలో సిసీ రోడ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ జాటోత్ రాంచంద్రనాయక్ నాయకత్వంలో నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుండి సిసి రోడ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు ఊడుగుల వెంకన్న మాట్లాడుతూ ప్రజల క్షేమం కొరకే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన నిర్వహిస్తుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బుడిగెం లక్ష్మీనారాయణ, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాము, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ రమేష్ గ్రామ మాజీ సర్పంచ్ నాగాడు ఉపేంద్ర- ఉప్పలయ్య,ఉపసర్పంచ్ బానోత్ బుజ్జి -వెంకన్న, గ్రామ వార్డ్ మెంబర్ సభ్యులు, గ్రామ ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోత్ వీరన్న, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.