ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన నాయకులు
తెలుగుగళం న్యూస్, శింగనమల, రిపోర్టర్- తులసిరామ్.
శింగనమల నియోజకవర్గం లోని పలు మండలాల్లో బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, సింగనమల, నార్పల, పుట్లూరు, ఎల్లనూరు ఉన్న గ్రామాల్లో, గ్రామీణ రహదారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదని, గ్రామీణ రహదారులను మరియు మండల కేంద్రం నుండి
మోడల్ స్కూల్ మరియు హై స్కూల్లకు, కస్తూర్బా పాఠశాలలకు, రోడ్ల వసతి మరియు హెచ్.ఎల్.సి కెనాల్ మీద బ్రిడ్జిలు శిథిలావస్థలో ఉన్నాయని వాటిని తిరిగి నిర్మించాలని భారతీయ జనతా పార్టీ సింగనమల నియోజకవర్గం అసెంబ్లీ కో కన్వీనర్ కుందు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి వివరించి వినతి పత్రంను అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్పల మండల అధ్యక్షుడు కమ్మరి కాశీ విశ్వనాథ్, ఎస్సీ మోర్చ మండల అధ్యక్షుడు అయ్యప్ప,పుట్లూరు మండలం ఉపాధ్యక్షుడు రామిరెడ్డి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి హరినాథ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.