సన్మానం అనంతరం గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలి -- ఎం ఎల్ ఎ జారే ఆదినారాయణ కి వినతి అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నీ క్యాంప్ కార్యాలయంలో పుట్ట తోగు గ్రామస్తులు సన్మానించడం జరిగింది. సన్మానం అనంతరం గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వటం జరిగింది.గ్రామంలోని సిసి రోడ్లు అంగన్వాడి బిల్డింగ్ అలాగే చెరువు దగ్గర బతుకమ్మ మెట్లు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు స్పందించి కచ్చితంగా పుట్టుతోగు గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీ అలాగే బతుకమ్మ మెట్లు, అంగన్వాడి బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన వారిలో సున్నం కృష్ణ, రవి, సత్యనారాయణ, వరబాబు, సతీష్ పాల్గొన్నారు.