
రైతులకు బహిరంగ మార్కెట్ వాల్యూ కు పరిగణలోకి తీసుకొని 3 రేట్లు నష్టపరిహారం చెల్లించాలి.
సిపిఎం జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి
నాగ్పూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్సప్రెస్ హైవే నిర్మాణా నికిపిలిచినా టెండర్లను తక్షణమే రద్దు చేసి రైతులకు బహిరంగ మార్కెట్ వాల్యూ కు పరిగణలోకి తీసుకొని 3 రేట్లు నష్టపరిహారం చెల్లించాలని, భూమి కి బదులు భూమిని ఇవ్వాలని సిపిఎం జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి డిమాండ్ చేసారు.
ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని అందచేశారు. >> ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి మాట్లాడుతూ.., ప్రతి యేటా మూడు పంటలు పండించుకునే పొలాల భూముల నుంచి హనుమకొండ జిల్లా లో నడికూడా, పరకాల, దామెర, ఆత్మకూరు మండలాల పరిధి లోని సుమారు 20 గ్రామాలు లలో రైతుల భూములను బలవంతంగా
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేబట్టబోతున్నారు. ఇప్పటికే రైతులు అనేక రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని అయన విమర్శించారు. రైతులు బహి రంగ మార్కెట్లో ఎకరం ధర రూ.రెండు కోట్లకు పైగా పలుకుతోందని, మూడు పంటలు పండించుకునే భూములను కోల్పోయేందుకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. భూసేకరణ పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవడ మేమిటని ఆయన ప్రశ్నించారు. నేషనల్ హై వే అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ, వారు రూపొందించిన తప్పుడు నివేదికలను ప్రభుత్వాలకు అందిస్తున్నారని ఆరోపిం చారు. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి, రైతులకు విరుద్ధంగా టెండర్లను పిలవడమేమిటని ప్రశ్నించారు. కేవలం అదానీ, అంబానీల సౌకర్యం కోసమే రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేసారు. పంట భూములతో పాటు వ్యవ సాయ బావులను సైతం రైతులు కోల్పోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే గ్రీన్ ఫీల్డ్ హై వే టెండర్లను రద్దు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాడుతామని , రైతులు ఎవరు అధైర్య పడవద్దని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ వినతి పత్రం అందచేసిన బృందం లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.చుక్కయ్య, గోడుగు వెంకట్ , డి.భాను నాయక్ లు పాల్గొన్నారు.