గ్రూప్-2 వాయిదా వేసే వరకు పోరాటం ఆగదు-RSప్రవీణ్ కుమార్
Hyderabadగ్రూప్-2 వాయిదా వేసే వరకు పోరాటం ఆగదు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
టీఎస్పీఎస్సీ చైర్మన్,బోర్డు సభ్యులపై నిరుద్యోగులకు నమ్మకం లేదు
పేపర్ లీకేజీల కుంభకోణం వెనుక కల్వకుంట్ల కుటుంబం హస్తం
గ్రూప్-2 అభ్యర్థులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి
భారీ పోలీసు బలగాల మధ్య ముగిసిన ఆర్ఎస్పీ సత్యాగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ నాయకుల అరెస్టు,విడుదల
గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసే వరకు నిరుద్యోగుల పక్షాన బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.శనివారం తన నివాసంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ముగిసిన అనంతరం ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష పిలుపునిస్తే,కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుని గృహనిర్భంధం చేసిందని ఆరోపించారు.అధికార పార్టీ నేతల ప్రొద్భలంతో ఆర్టీసీ కార్మికులు రాజభవన్ ముట్టడిస్తే, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తే తప్పు లేదు కానీ,ప్రతి పక్షనేతలు శాంతియుతంగా దీక్షలు చేస్తే మాత్రం గృహనిర్బంధం చేయడం ఎందుకని ప్రశ్నించారు.రాబోయే రోజుల్లో కేసీఆర్ పై ప్రజలు తిరగుబాటు చేసి ఫామ్ హౌజ్ కు పరిమితం చేయాలన్నారు.
రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా ఎవ్వరైనా ధర్నా చేసుకోవచ్చు కానీ,రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. పోలీసులను నమ్ముకునే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. లక్షలాదిమంది నిరుద్యోగుల కోసమే బీఎస్పీ పోరాటం చేస్తుంది తప్ప,ఫామ్ హౌజ్ ల కోసం కాదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.పేపర్ లీకేజీలతో సంబంధం ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులతో మళ్ళీ పరీక్షలు పెడుతున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు నెలలోనే గురుకుల బోర్డు,గ్రూప్ -2, జూనియర్ లెక్చరర్స్,డిగ్రీ లెక్చరర్స్ వంటి అనేక రకాల రాత పరీక్షలు ఎలా పెడుతారని ప్రశ్నించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు.వివిధ పరీక్షలకు వేర్వేరు సిలబస్ ఉంటుందని అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారని అన్నారు.నిరుద్యోగులు కూడా మనుషులేనన్న ఆయన మర మనుషులు కాదన్నారు. తెలుగు అకాడమీ గ్రూప్-2 సిలబస్ కు సంబంధించిన మెటీరియల్ ముద్రించి,ఇవ్వడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.కోచింగ్ నిర్వాహకుడు అశోక్ ను జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ ఫ్యాకల్టీ రియాజ్ ను
టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం అన్యాయమన్నారు.
అధికార పార్టీ ధర్నాలు చేస్తే పోలీసులు ఒక రూల్ పాటిస్తూ, ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తే మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ వాళ్లకు పోలీస్ బందోబస్తు ఇస్తూ, ప్రతిపక్ష పార్టీల నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు.
కల్వకుంట్ల కుటుంబం గ్రూప్-2 పోస్టులు అమ్ముకున్నారనే అనుమానం నిరుద్యోగులు కలుగుతుందన్నారు.నిరుద్యోగ వ్యతిరేక పాలన అంతం అయ్యే వరకు బీఎస్పీ పోరాటం చేస్తుందన్నారు.
పేపర్ లీకేజీల మీద అసెంబ్లీలో అధికార,ప్రతిపక్ష పార్టీల ఎమ్మేల్యేలు ఎందుకు మాట్లాడలేదన్నారు.నిరుద్యోగులు మీకు ఓటు వేయలేదా లేక భవిష్యత్తులో వేయరని మాట్లాడడం లేదా అని అన్నారు.
పేపర్ లీకేజీ అయినప్పుడు మంత్రి కేటీఆర్ నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్ హామీ ఇచ్చి విస్మరించడాన్నారు.కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 అభ్యర్థులకు మద్దతు తెలిపిన బీఎస్పీ నాయకులు,కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని ముందస్తు అరెస్టు చేశారన్నారు.