
ఘనంగా కామ్రేడ్ జమాల్ 21వ వర్థంతి సభ
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఎండి జమాలుద్దీన్ 21వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జమాల్ పెద్ద కుమారుడు ఎండి కాసీం సిపిఎం జెండాను ఆవిష్కరించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి గుండెబోయిన రాజు మాట్లాడారు.కామ్రేడ్ జమాల్ పార్టీ అభివృద్ధి కోసం పేద,బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.కామ్రేడ్ జమాల్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో
సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఉప్పునూతల మల్లయ్య,జనగామ జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి షబానా, శాఖ కార్యదర్శి ఎండి శంషుద్దీన్,వేల్పుల పెద్ద రామన్న,వడ్లకొండ రాజు, పులిగిల్ల నాగరాజు, రాయపర్తి లక్ష్మి,బక్క పిచ్చక్క,ఉప్పునూతల గౌరయ్య,నక్క లింగమూర్తి, రాయపర్తి మల్లేశం,ఎండి భాష,కొంతం అంజయ్య, అన్నెపు ప్రభాకర్,పొట్లచర్ల భారతమ్మ,వడ్లకొండ సమ్మక్క,కుక్కల శోభ,దొంతూరి సుధాకర్, కొంతం యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.