
annual telangana state level tribal games meeting
గత మూడు రోజులుగా స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు జరిగిన రాష్ట్రస్థాయి 4వ, గిరిజన క్రీడోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి ప్రతీక్ జైన్ ఐఏఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ ఐటీడీఏ భద్రాచలం మరియు కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే కొత్తగూడెం ముఖ్య అతిథులుగా హాజరైనారు. పి. మణెమ్మ డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ భద్రాచలం, హెచ్.డేవిడ్ రాజ్ డేవిడ్ రాజ్ ఏపీఓ జనరల్ ఐటిడిఏ భద్రాచలం, స్టేట్ స్పోర్ట్స్ ఆఫీసర్ బి. జ్యోతి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్స్ బి.గోపాల్ రావు భద్రాచలం, బి రమేష్ ఉట్నూర్, మీనారెడ్డి ఆసిఫాబాద్, కిష్టు వరంగల్, జి.చందన్ పీజీహెచ్ఎం అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ, ఎస్. చంద్రమోహన్ ఏటీడీవో దమ్మపేట, ఎస్. కే. జహీరుద్దీన్ ఏటిడిఓ వైరా, పి. నరసింహారావు ఏటిడిఓ భద్రాచలం, బి. రూప దేవి ఏటిడిఓ ఎల్లందు, ఏసీఎంవో టి.రమణయ్య భద్రాచలం, ఏసియన్ఓ డి. నాగేశ్వరరావు ఖమ్మం, బి.చందు స్పోర్ట్స్ స్కూల్ హెచ్. యం. కిన్నెరసాని, బి. శారద స్పోర్ట్స్ స్కూల్ హెచ్ఎం కాచినపల్లి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతీక్ జైన్,ఐ.ఏ.ఎస్. ఐ టి డి ఏ భద్రాచలం, గారు అండర్ 17 వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభించి విద్యార్థులతో వాలీబాల్ ఆడి విద్యార్థులను ఉత్తేజపరిచారు.
ఈ కార్యక్రమానికి అతిధులుగా కొత్తగూడెం ఎం.ఎల్.ఏ.కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు ఆయన సందేశం ఇస్తూ గ్రామీణ గిరిజన విద్యార్థులు సహజంగా దృఢంగా ఉంటారు ఇలాంటి పిల్లలను క్రీడలలో తర్ఫీదు ఇచ్చినట్లయితే భవిష్యత్తులో దేశానికి ఎంతో ఉపయోగపడతారని ఆశించారు. పిల్లలలో చదువు సామర్థ్యము రెండు కలిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని, కావున పిల్లలు క్రీడలతో పాటు చదువులో ముందుండాలని కోరారు.
అనంతరం భద్రాచలం ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, ఐ.ఏ.ఎస్. సందేశమిస్తూ బాల బాలికలందరూ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని కోరారు. కొంతమంది బల, బాలికలను సభలో వారి అనుభవాలను గురించి మాట్లాడించారు. వారు సభలో ప్రసంగించిన విధాన్ని మెచ్చుకున్నారు పిల్లలకు పాఠశాలల్లో ప్రసంగ పోటీలను ఏర్పరచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరారు. గిరిజన విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్.సాధించాలని ఆకాంక్షించారు. గిరిజన పిల్లలు తనలాగా ఐఏఎస్ సాధించి ఏదైనా ఒక ఐ టి డి ఏ. లో. పి.ఓ. సీట్లో కూర్చున్న నాడు తను చాలా సంతోషిస్తానని అన్నారు.
శ్రీ హెచ్ డేవిడ్ రాజ్ ఏ పీ ఓ జనరల్ ఐటిడిఏ భద్రాచలం వారు ఈ క్రీడా పోటీలలో సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయని నిర్వహణ బాగుందని నిర్వాహకులను అభినందించారు. గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఈ క్రీడా పోటీలు గురించి మాట్లాడిన సందర్భంలో తమ అనుభవాలను చాలా చక్కగా వివరించారని మెచ్చుకున్నారు.
అనంతరం వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం జరిగినది.
ఈ క్రీడలలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను ఐటిడిఏ భద్రాచలం గెలుపొందగా అథ్లెటిక్స్ నందు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను ఐటిడిఏ ఉట్నూర్ గెలుపొందినది.
ఈ క్రీడలలో ఫైనల్ లీగ్ గెలిచిన జోన్స్
••••••••••••
వాలీబాల్:
••••••••••••
మొదటి బహుమతి( బాలికలు) భద్రాచలo,
రెండవ బహుమతి( బాలికలు): ఉట్నూరు,
మొదటి బహుమతి( బాలురు) భద్రాచలం,
రెండవ బహుమతి(బాలురు):ఏటూరు నాగారం
°°°°°°°°°°
ఖో ఖో:
°°°°°°°°°
మొదటి బహుమతి ( బాలికలు): ఉట్నూరు రెండవ బహుమతి( బాలికలు): ఏటూరు నాగారం
మొదటి బహుమతి ( బాలురు):ఉట్నూరు రెండవ బహుమతి( బాలురు): భద్రాచలం
•••••••••••
టెన్నికాయిట్:
••••••••••••
మొదటి బహుమతి( బాలికలు& బాలురు): ఉట్నూరు
రెండవ బహుమతి( బాలికలు): ఉట్నూరు,
రెండవ బహుమతి( బాలురు):భద్రాచలం,
క్యారమ్స్:
మొదటి బహుమతి( బాలురు& బాలికలు): భద్రాచలం
°°°°°°°°°°°
చెస్:
°°°°°°°
మొదటి బహుమతి( బాలికలు): ఉట్నూరు.
రెండవ బహుమతి( బాలికలు): ఉట్నూరు
మొదటి బహుమతి( బాలురు): భద్రాచలఓ
రెండవ బహుమతి( బాలురు
): ఉట్నూర
ఈ క్రీడలలో ఫైనల్ లీగ్ గెలిచిన జోన్స్
••••••••••••
వాలీబాల్:
••••••••••••
మొదటి బహుమతి( బాలికలు) భద్రాచలo,
రెండవ బహుమతి( బాలికలు): ఉట్నూరు,
మొదటి బహుమతి( బాలురు) భద్రాచలం,
రెండవ బహుమతి(బాలురు):ఏటూరు నాగారం
°°°°°°°°°°
ఖో ఖో:
°°°°°°°°°
మొదటి బహుమతి ( బాలికలు): ఉట్నూరు రెండవ బహుమతి( బాలికలు): ఏటూరు నాగారం
మొదటి బహుమతి ( బాలురు):ఉట్నూరు రెండవ బహుమతి( బాలురు): భద్రాచలం
•••••••••••
టెన్నికాయిట్:
••••••••••••
మొదటి బహుమతి( బాలికలు& బాలురు): ఉట్నూరు
రెండవ బహుమతి( బాలికలు): ఉట్నూరు,
రెండవ బహుమతి( బాలురు):భద్రాచలం,
క్యారమ్స్:
మొదటి బహుమతి( బాలురు& బాలికలు): భద్రాచలం
°°°°°°°°°°°
చెస్:
°°°°°°°
మొదటి బహుమతి( బాలికలు): ఉట్నూరు.
రెండవ బహుమతి( బాలికలు): ఉట్నూరు
మొదటి బహుమతి( బాలురు): భద్రాచలఓ
రెండవ బహుమతి( బాలురు): ఉట్నూరు